కష్టేఫలే

చాలా మందికి, అనగా నేటి వారికి ఇదేంటో తెలియదనే చెప్పాలి. అదేంటో చెప్పుకోండి చూద్దాం.

తిరగలి, దీనిని పిండి చేసుకోడానికి, నూక విసరడానికి, పప్పులు చేసుకోడానికి వాడేవారు, ఇప్పుడు మిక్సీ లాటిది.తిరగలితో విసరడం కబుర్లు చెప్పినంత తేలికకాదు.గింజలు పోసి కొద్దిగా పై రాయి ఎత్తి నెమ్మదిగా విసరాలి. గబ గబా విసిరితే పప్పు నూకయి ఊరుకుంటుంది. చిన్నప్పుడు అమ్మ దగ్గర విసరడం నేర్చుకున్నాఅ. ఇప్పుడు ఇల్లాలు  దగ్గరకి రానీయటం లేదు, విసరడానికి 🙂

పార, ఇది ఒక వ్యవసాయ పని ముట్టు. దీని వాడకం కూడా తగ్గిపోతూంది, పల్లెలలో కూడా.దీనితో చేసేపని ఇప్పుడు పెద్ద యంత్రాలు చేస్తున్నాయిప్పుడు, పల్లెలలో.పారతో పని చెయ్యాలంటే నడ్డి వంచి పని చెయ్యాలి అబ్బో! చాలా కష్టమండి బాబూ! దీనితో ఇప్పటికి అప్పుడప్పుడు చేస్తుంటా.

మిక్సర్ గ్రైండర్ లో ఒక భాగం. ఇది రుబ్బు రోలు ,  పైది   పొత్రం, పొడుగుగా ఉన్నదానిని పచ్చడి బండ అంటారు. రోలు, పొత్రం రాతివి, బండ మాత్రం కర్రది.కుంపటి మీద కాగిన చారు లాగా, పచ్చడి బండతో చేసిన పచ్చడి రుచే వేరు. పొత్రంతో రుబ్బిన మినప పిండితో గారెలేసుకుంటే నా రాజా! భారతం విన్నంత హాయిగానూ ఉంటుంది.

వీటిని గునపం లేదా గడ్డపార అంటారు, వివిధ సైజులలో, అవసరాన్ని బట్టి ఉపయోగిస్తారు.తవ్వడానికి ఉపయోగించే సాధనం.చిన్న గునపాలతో భయం లేదు కాని పెద్ద గునపంతో పని చేసేటపుడు సరిగా చేయకపోతే కాలు మీద…

అసలు టపాను చూడండి 224 more words

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.