అనగనగా ఒక ఊరు, ఆ ఊరులో ఒక వ్యక్తి చాలా కాలం క్రితం విదేశాలకు వెళ్ళిపొయాడు, ఇప్పుడు ఊరికి ఏదైనా మంచి చెయ్యాలి అనే తపన మొదలై ఊరికి తన కుటుంబంతో సహా బయలుదేరాడు!

మరి ఆ ఊరు ఆకలితో అలమటించే వారు ఎక్కువగా ఉన్న ఊరు, మరి ఆ ఊరికి ఉట్టిచేతులతో వెళితే బాగుండదు అని ఆలోచించి, ఆ ఊరికి చాలా దూరంలో ఉన్న సముద్రం దగ్గర నీటి శుద్ది యంత్రం పెట్టించాడు. ఆ యంత్రంతో అతను ప్రతీ సంవత్సరం వేసవి కాలంలో ఒక Lorry water అతని ఊరికి తనతో పాటు తీసుకు వెళ్ళే వాడు.

తరువాత అసలు ఊరిలో తన ఇల్లు లేదు, ఎప్పుడో అమ్మేసాడు, దాంతో మరి ఎక్కడ ఉండాలి, అందుకని mobile canteen లో భార్యా పిల్లలతో బయలు దేరాడు.

అలా ఊరికి చేరాకా, మొదట ఆ ఊరిలోని Bank కు వెళ్ళి ఎవరు వ్యవసాయం మీద అప్పులు చేసి తీర్చలేని స్థితిలో ఉన్న వారి చిట్టా తెచ్చుకున్నాడు. ముందుగా బాగా ఆ చిట్టాలో వయసు పైబడి ఉన్నవారిని ఎన్నుకుని వారిని తనతో వాళ్ళ పొలం వైపుకు తీసుకు వెళ్ళాడు, అలా తీసుకుని వెళ్ళి వాళ్ళ పొలాలు చూసాడు. మొదటగా మెట్ట ప్రాంతంలో ఉన్న రైతుల పొలం ఎన్నుకుని, ఆ పొలం తను కొన్నాడు, తరువాత ఆ రైతుకు దిగువ ప్రాంతంలో ఉన్న తన పొలం కౌలుకు ఇచ్చాడు, అతని కౌలు పత్రం విచిత్రంగా ఉంటుంది, వరి వేసి లాభం వస్తే చెరి సగం నష్టం వస్తే ఆ పొలం తోటలుగా మార్చేయమని అది కూడా కూరగాయలు మాత్రమే ఏ విధమైన వాణిజ్య పంటలు వెయ్యకూడదు అని.

ఆ మెట్ట ప్రాంతంలో ఉన్న భూమిని రెండు భాగాలుగా విడగొట్టి, ఒక భాగంలో చెరువు తవ్వించడం మొదలు పెట్టాడు. ఇది ఇలా జరుగుతూ ఉంది.

ఇక దిగువ ప్రాంతంలో రైతుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ సాయంతో అక్కడ summer camp కు కావలిసిన విధంగా నేలను చదును చేయించడం మొదలు పెట్టాడు.

ఇక వారం తరువాత ఆ ప్రాంతం చదును అయ్యింది. తరువాత తన corporate circle లోని స్నేహితులకు బంధువులకు తన ఈ summer camp గురించి చెప్పాడు, వాళ్ళు ఇక్కడకు రావాలి అంటే తను కట్టించిన నీటి శుద్ధి యంత్రం లో నీళ్ళు Lorry ద్వారా ఇక్కడకు తెచ్చుకోవాలి, వాళ్ళు తెచ్చుకున్నా పర్వాలేదు, మరియు వాళ్ళు mobile canteen తెచ్చుకోవాలి అన్నాడు.

మొదట రెండు జంటలు కుటుంబ సమేతంగా చేరారు, ఆ చదును చేసిన నేలలో అప్పటికే Hockey ground, Basket ball ground తయారు చేయించాడు. ఆ రెండు జంటలు ఈ శ్రీమంతుడి కుటుంబం అక్కడ విహార యాత్ర మొదలు పెట్టారు. ఆ ఊరి జనంతో కలిసి ఆటలు పాటలు….

ఇక ఈ రెండు జంటలు వెళ్ళాకా వారు అనుభవించిన సుఖాలు, ఆడిన ఆటలు social networking sites లో చూసి ఊరికి తాకిడి పెరిగింది, తన కల ఇంత తొందరగా నెరవేరుతుంది అని ఆ శ్రీమంతుడు ఊహించలేదు. వాళ్ళు అలా విహార యాత్రలు ముగించుకున్నాకా వేసవి ముగిసింది.

 

ఇక ఆ ఊరికి విడిదికి వచ్చిన వాళ్ళు నీళ్ళు తేవడం ఆ తెచ్చిన నీటితో అక్కడ grounds చుట్టూ నాటిన మొక్కలకు నీళ్ళు పొయ్యడం, ఇక వాళ్ళు తిరిగి వెళ్ళే సమయంలో మిగిలిన నీటిని ఆ ఊరి లో ఉన్న చెరువులో వదిలెయ్యడం అన్నీ క్రమంగా జరిగాయి. ప్రతీ వేసవిలో చాలా చెరువులు తవ్వించి వాటి చుట్టూ చెట్లు పెంచి, ఆ ఊరికి నీటి సమస్య కొంతవరకూ తగ్గించ గలిగాడు, అలా కొన్నళ్ళకు ఊరిలో నీటి కష్టాలు తీర్చాడు, అప్పుల బాధ పడుతున్న రైతులను అప్పుల బాధ నుంచీ తప్పించడు.

ఇక చేరువులు ఊరి జనాభా నీటి సమస్య తీరేవకూ తవ్వించాడు, తరువాత నుంచీ చెరువులు బాగుచేయించడం చేసాడు చేయించాడు.

ఇలా ప్రతీ సంవత్సరం వేసవి రెండు నెలలూ చెయ్యడంతో ఆ ఊరు పచ్చదంతో సౌభగ్యంగా వెలగడం మొదలు పెట్టింది.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.