ప్రభుత్వం పన్ను భారం వేయకుండా ప్రజల నుంచీ సమదించే ప్రయన్త్నాలు చాల చేస్తుంది!

అందులో కొన్ని

ప్రజల చేత fixed deposit చేయించ నివ్వక పోవడం

ప్రజల చేత stock market లో డబ్బు నిల్వ చేయించడం

ప్రజలను నిత్య వేతన జీవులుగా మార్చడం లాంటివి!

అదేమిటి అవి communist సిద్దాంతాలు కదా BJP చేస్తుంది అని అంటున్నాను అనుకుంటున్నారా, నిజమే కదా.

ప్రస్తుత ఆర్ధిక విధానం అదే చూపిస్తుంది!

నిజానికి ప్రభుత్వం communist విధానాలకు వెళుతుంటే communist లు నా అనే సిద్ధాంతం దగ్గరకు చేరుతున్నారు!

ఒక BJP అభిమానిగా ఈ blog లో ఇలా రాయడానికి నేను చాలా కష్ట పడుతున్నాను!

ఎందుకంటే అభిమాని ఎప్పుడూ తిట్ట లేడు కదా!

అది అల ఉంచితే అసలు ప్రభుత్వం పరోక్ష పన్నుల మీదకు దృష్టి పెట్టడం ఎందుకు మొదలు పెట్టింది?

 

ప్రభుత్వాలకు డబ్బులు రావట్లేదు, నల్ల ధనం పెరిగిపోతుంది, అప్పుడు congress పరిపాలనా సమయంలో శివాజీ చిత్రం లో చూపిన విధంగా బియ్యం సంచులలో డబ్బులు కట్ల కట్లగా దాచుకున్నారు అన్నది లోక విదితం, అవి లాగడానికి జరిగే పని కాదు, అందుకే ఉద్యోగుల మీద ఈ ప్రతాపం.

ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగే బక్క చిక్కేది!

ఇక ప్రభుత్వాలకుపన్ను విధానం వల్ల , ముందుగా చెప్పినట్టు సంచులలో ఎక్కువ కాలం ఉంచితే డబ్బు పెరగదు కాబట్టి ప్రజలు దాన్ని ఎదో ఒక అవసరానికి వాడతారు, కాబట్టి వాటి మీద indirect పన్నుల ద్వారా లాభాలు పొందడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం.

చెడు మీద గెలవడానికి కష్ట పడే వాడిని కూడా చెడ్డ వాణ్ని చేస్తున్నారు!

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.