ముద్దులొలికే స్వామి, వింత బావి – తిరుచెందూరు

మంచి విషయాలు ఎన్నిసార్లు పంచినా మంచిదే

తెలుగు భావాలు

షణ్ముఖునికి తమిళనాట ఆరు ప్రముఖమైన క్షేత్రాలున్నాయి. వాటిలో ఒకటి – ఈ తిరుచెందూరు. 2000 ఏళ్ళ చరిత్ర గల ఈ పుణ్య క్షేత్రం, సముద్రాన్నానుకొని ఉండడం గమనించదగ్గ విశేషం. సముద్ర కెరటాలు తిన్నగా వచ్చి గుడిని తాకుతుంటాయి.

స్థల పురాణం

ఒకానొకప్పుడు, ఈ పవిత్ర స్థలంలో అసురుడైన శూరపద్ముడు – తన సోదరులగు సింహముఖుడు మరియూ తారకులతో ముల్లోకాలను ఏలుతుండేవాడు. ఆరు ముఖాలతో ఆర్ముగం, షణ్ముఖుడు అని పిలువబడే సుబ్రహ్మణ్యస్వామి వారు, కైలాసం నుండి తిరుచెందూరుకు – అసుర సంహారమునకై దిగి వచ్చారు. తన శివారాధన నిమిత్తం, మయుడిని రప్పించి ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆఙ్ఞాపించారు. ఆ తరువాత స్వామివారు అసురసంహారానికై పూనుకొని, వారితో ఆరు రోజులు ఎడతెఱిపి లేకుండా నేలపైన, సముద్రముపైన, ఆకాశములో యుద్ధం చేశారు. ఆ భీకర యుద్ధంలో శూరపద్ముడు మినహా అందరూ సంహరింపబడ్డారు. శూరపద్ముడు సముద్రానికి దగ్గిరలో ఒక మామిడి చెట్టు రూపంలో ఉద్భవించాడు. స్వామివారు ఇంద్రుడిని తన వాహనముగా చేసుకొని, ఆ రాక్షసుడితో వాడి నివాసంలోనే ఎదిరించి పోరాడి, చివరికి రెండు ముక్కలుగా చీల్చి ఆ రక్కసుని సంహరించారు. కానీ ఆ రెండు ముక్కలు కోడిపుంజు, మగ నెమలిగా మారి స్వామివారితో తలపడ్డాయి. ఇలా చివరివరకూ పోరాడిన ఆ రాక్షసుడు స్వామివారిచే క్షమింపబడి, ఆయన విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందాడు. ఇంద్రుడి బదులు ఆ మగ నెమలిని తన వాహనంగా చేసుకొని, కోడిపుంజును తన పతాక చిహ్నముగా…

అసలు టపాను చూడండి 712 more words

ప్రకటనలు
ముద్దులొలికే స్వామి, వింత బావి – తిరుచెందూరు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.